AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది… ఆసక్తి రేకెత్తిస్తోన్న స్టోరీ లైన్‌..

Sai Dharam Tej: బైక్‌ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న మెగా మెనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాతో బిజీగా మారాడు. ప్రస్తుతం తేజ్‌ 15వ చిత్రం..

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది... ఆసక్తి రేకెత్తిస్తోన్న స్టోరీ లైన్‌..
Sai Dharam Tej
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 13, 2022 | 8:28 PM

Share

Sai Dharam Tej: బైక్‌ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న మెగా మెనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాతో బిజీగా మారాడు. ప్రస్తుతం తేజ్‌ 15వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘భమ్‌ బోలేనాథ్‌’ ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు సుకుమార్‌ భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా సుకుమార్‌ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, కథ కూడా అందిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేసింది. అడవిలో చెట్ల నడుమ సాయి ధరమ్‌తో పాటు కొందరు వ్యక్తులు చర్చిస్తున్నట్లున్న ఈ ఫొటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమా చేతబడి నేపథ్యంలో ఉండనుందనేది సదరు వార్త సారంశం. చేతబడి పేరుతో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామంలోకి హీరో వస్తాడు.

ఇవి కూడా చదవండి

అసలు గ్రామంలో మరణాలు ఎందుకు జరుగుతున్నాయి.? ఆ మిస్టరీల వెనక అసలు నిజం ఏంటన్న విషయాలను హీరో ఎలా ఛేదించాడన్న నేపథ్యంలో కథ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు ఉన్నాయి. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా ట్రైలర్‌ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!