‘సాహో’ టీజర్ రికార్డుల మోత..!

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా టీజర్ నిన్న రిలీజయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ టీజర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ.. యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఐదు భాషల్లో రిలీజైన ఈ టీజర్ ఒక్క రోజులోనే అన్ని భాషలు కలిపి 57 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా ‘సాహో’ రికార్డు […]

'సాహో' టీజర్ రికార్డుల మోత..!
Follow us

|

Updated on: Jun 14, 2019 | 9:26 PM

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా టీజర్ నిన్న రిలీజయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ టీజర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ.. యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఐదు భాషల్లో రిలీజైన ఈ టీజర్ ఒక్క రోజులోనే అన్ని భాషలు కలిపి 57 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా ‘సాహో’ రికార్డు సృష్టించింది.

మరోవైపు సినీ అభిమానులందరూ ఈ టీజర్ కు ఫిదా అయ్యారనే చెప్పాలి. టీజరే ఇలా ఉంటే.. ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అని అప్పుడే వారిలో ఆసక్తి మొదలైంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ను జూలై 1న రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే యూవీ క్రియేషన్స్ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం దేశమంతా ‘సాహో’ మేనియా నడుస్తోంది.