RRR Diwali gift: భారతీయ సినీ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్‌ని ఇచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఓ ఫొటో సెషల్ పెట్టి, ఫొటోలను విడుదల చేసింది. ఇక మరో ఫొటోలో జక్కన్న కూడా ఈ ఇద్దరితో భాగం అయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇరు హీరోల ఫ్యాన్స్ అయితే ఆ ఫొటోలతో పండుగ చేసుకుంటున్నారు. (‘బ్రోచేవారెవరురా’ దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోన్న నజ్రియా)
కాగా రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. వారి సరసన అలియా భట్, ఒలివియా నటించనున్నారు. అలాగే అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణతో పాటు పలువురు హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ మూవీ పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. (కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నా చెస్ట్‌పై అదిమి కూర్చునట్లు అనిపించేది)
Giving you all the best of wishes and prosperity this Diwali from team #RRRMovie.#RRRDiwali… ?? pic.twitter.com/mJi1Ti9mf3
— RRR Movie (@RRRMovie) November 13, 2020