RRR Movie: బాహుబలి సిరీస్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR). మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) హీరోలుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియో మోరీస్ హీరోయిన్లుగా మెప్పించారు. వీరితో పాటు శ్రియాశరణ్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌కు అందరూ ముగ్దులై పోయారు. ఇది కలెక్షన్ల రూపంలోనూ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000 కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇలా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ స్ర్కీన్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోంది.
#RRR Netflix 13.94M viewing hours in second week & 18.36M viewing hours in first week. The most watched non english film worldwide for two consecutive weeks. The total viewing hours is 39.48M in 15 days
ఇవి కూడా చదవండి— Indian Box Office (@box_oficeIndian) June 8, 2022
కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం మే 20నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లిష్ సినిమాల్లో వరుసగా రెండు వారాల పాటు అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో మొదటివారం18 మిలియన్ అవర్స్ కు పైగా వీక్షించగా.. రెండవ వారం 13.9 మిలియన్ల అవర్స్‌కు పైగా వీక్షించినట్లు అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. మొత్తం మీద15 రోజుల్లో 39.48 మిలియన్ల అవర్స్‌కు పైగా వీక్షించినట్లు ఇందులో పేర్కొంది. కాగా ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూర్చారు.
Also Read:
Fire Accident: మెట్రో పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన వందలాది వాహనాలు
YS Sharmila: జగనన్నకు పోటీగా ట్రాక్టర్ నడిపిన షర్మిలక్క.. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగిందిలా..