జాగ్రత్త వహించండి.. కరోనాపై ఎన్టీఆర్, రామ్ చరణ్ వీడియో

రోజురోజుకు తన ప్రభాల్యాన్ని పెంచుకుంటూ.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఆట కట్టించేందుకు అగ్రదేశాలు నడుం బిగించాయి. ఈ వైరస్‌ను నివారించేందుకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో తలమునకలై ఉన్నాయి.

జాగ్రత్త వహించండి.. కరోనాపై ఎన్టీఆర్, రామ్ చరణ్ వీడియో
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 17, 2020 | 8:37 AM

రోజురోజుకు తన ప్రభాల్యాన్ని పెంచుకుంటూ.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఆట కట్టించేందుకు అగ్రదేశాలు నడుం బిగించాయి. ఈ వైరస్‌ను నివారించేందుకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో తలమునకలై ఉన్నాయి. మరోవైపు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటూ పలువురు తమ సోషల్ మీడియాల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కరోనాపై టాలీవుడ్ అప్రమత్తమైంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది. అలాగే స్టార్ హీరోలు సైతం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో కరోనాపై అందరిలో సామాజిక స్పృహను కలిగించేందుకు మన టాలీవుడ్ హీరోలు ఓ అడుగు ముందుకేశారు. వైరస్ వ్యాప్తి గురించి భయపడకండి అని రెబల్‌స్టార్ ప్రభాస్ పిలుపునివ్వగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో వైరస్ సోకకుండా జాగ్రత్తలు చెప్పడంతో పాటు.. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకండి అంటూ చెర్రీ, తారక్ సూచించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఇద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా కరోనాతో మృత్యువాతపడ్డ వారి సంఖ్య 7,139కు చేరింది. 1,81587 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: టీడీపీ ఎంపీ మూడు రాజధానుల లేఖపై మోదీ సమాధానం..!