Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదా..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ప్రభావాన్ని చూపుతోంది. ఈ వైరస్ వలన అగ్రదేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. ఇక సినీ ఇండస్ట్రీపై కూడా కరోనా చాలా ప్రభావాన్ని చూపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ప్రభావాన్ని చూపుతోంది. ఈ వైరస్ వలన అగ్రదేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. ఇక సినీ ఇండస్ట్రీపై కూడా కరోనా చాలా ప్రభావాన్ని చూపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోన్న సమయంలో షూటింగ్‌లు, విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ నెల 31వరకు షూటింగ్‌లకు క్యాన్సిల్ చేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్ణయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటు చిన్న, అటు పెద్ద హీరోలకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా ఏప్రిల్, మేలో విడుదల తేదీలను పెట్టుకున్న హీరోలు డైలమాలో ఉన్నారు. ఈ లిస్ట్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న మూవీ యూనిట్.. అందుకు తగ్గట్లుగా షూటింగ్ చేస్తూ వచ్చింది. ఇక ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ఈ నెల 21న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో పవన్ టీమ్ డైలమాలో పడ్డదట. వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. మూవీ షూటింగ్‌ను కాస్త ఆలస్యంగానే పెట్టుకుందామని టీమ్ భావిస్తుందట. దీనిపై పవన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడితే.. సినిమా విడుదల కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపు రెండున్నర ఏళ్ల తరువాత పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఈ మూవీపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడిని వెండి తెరపై చూద్దామా అని వారు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా వాయిదా తప్పనిసరి అయితే వారు ఆశలు ఆవిరి అయ్యే అవకాశం ఉంది. కాగా ఈ మూవీని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.
Read This Story Also: జాగ్రత్త వహించండి.. కరోనాపై ఎన్టీఆర్, రామ్ చరణ్ వీడియో