ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను.. ఛాంపియన్ సక్సెస్ మీట్‌లో రోషన్

ఛాంపియన్ సినిమా మా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్. సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ పీపుల్స్ అని ఛాంపియన్ సక్సెస్ మీట్ లో హీరో రోషన్ అన్నారు. ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యానన్న రోషన్..

ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను.. ఛాంపియన్ సక్సెస్ మీట్‌లో రోషన్
Champion Success Meet

Updated on: Dec 26, 2025 | 8:51 PM

స్వప్న సినిమాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఛాంపియన్. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. మీడియా అందరికీ థాంక్యు సో మచ్. ఛాంపియన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. తనకి సినిమా అంటే చాలా పాషన్ సినిమా కోసం ఏమైనా చేస్తుంది. కిరణ్ గారికి థాంక్యూ, అలాగే జీకే గారికి, మా నిర్మాతలు అందరికీ థాంక్యూ సో మచ్. కళ్యాణ్ చక్రవర్తి గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పటినుంచి ఆయన నటన కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన మాకు ఒక ఇన్స్పిరేషన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను, మిక్కీ గారు బ్లాక్బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఆయన పాటలే చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్లాయి. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అనస్వర చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది. ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఛాంపియన్ ఎప్పటికీ నాకు స్పెషల్ ఫిలిం. నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్యూ. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా అందరికీ స్పెషల్. ఇది ఫ్యామిలీ మూవీ. అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను అని రోషన్ అన్నారు. .

హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. సినిమాకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి మమ్మల్ని ఛాంపియన్స్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ. ఛాంపియన్ నా మొదటి తెలుగు సినిమా. థియేటర్స్ లో కూర్చుని ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. గిరగిరా నా ఫేవరెట్ సాంగ్. మిక్కీ గారు అద్భుతమైన ఆల్బమ్ క్రియేట్ చేశారు. చంద్రకళ పాత్ర ఇచ్చిన ప్రదీప్ అన్నకి థాంక్యూ. సప్న గారి సపోర్ట్ కి థాంక్యూ. సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ.. అని అనస్వర రాజన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.