AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించండి: అమిత్‌ షాకు రియా ట్వీట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్‌ మరణించి నెల రోజులైంది. గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు ఈ నటుడు.

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించండి: అమిత్‌ షాకు రియా ట్వీట్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 16, 2020 | 4:41 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్‌ మరణించి నెల రోజులైంది. గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు ఈ నటుడు. అయితే ఆయన మరణంపై ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో ఆయనను హత్య చేశారని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక వారి డిమాండ్‌కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా కోరారు.

ఈ మేరకు ఓ ట్వీట్ వేసిన రియా.. ”అమిత్‌ షా సర్‌.. నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని. ఆయన మరణించి నెల రోజులు పూర్తైంది. ప్రభుత్వం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సుశాంత్‌ మరణంపై న్యాయం కోసం సీబీఐ చేత విచారణ చేయించండి. సుశాంత్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను నేను తెలుసుకోవాలి” అని కామెంట్ పెట్టారు. అయితే సుశాంత్ మృతి కేసులో రియా పాత్ర ఉందంటూ ఫ్యాన్స్ మొదటి నుంచి కామెంట్లు చేస్తుండగా.. ఇప్పుడు ఆ నటినే సీబీఐ ఎంక్వైరీని కోరడం గమనర్హం. అంతేకాదు సుశాంత్‌ తండ్రి సైతం రియా గురించి తమకు తెలీదంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్ కేసును విచారిస్తున్న ముంబయి పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించి, వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.

Follow Us