Vyooham : రేపే వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌కు ఆర్జీవీ ఆహ్వానం
ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్ ఆర్జీవీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం వైసీపీ, టీడీపీ నేతలకు పంపినట్లు చెప్పారు డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన అది సంచలనమే.. ఈ సెన్సేషన్ డైరెక్ట్ర్ ఇప్పుడు వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్ ఆర్జీవీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం వైసీపీ, టీడీపీ నేతలకు పంపినట్లు చెప్పారు డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. అలాగే రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. విజయవాడలో రేపు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం అని అన్నారు.
అలాగే మా వ్యూహంలో ఎలాంటి వ్యూహం లేదు, సీఎం జగన్‌కు ఈ వ్యూహానికి ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు ఆర్జీవీ. అదేవిదంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వైసీపీ నేతలకు ఆహ్వానం పంపాను. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌కు ట్విట్టర్ ద్వారా ఆహ్వానం పంపాను అని తెలిపారు డైరెక్టర్ ఆర్జీవీ.
ఒక నిజాన్ని ఈ సినిమా రూపంలో చెప్పబోతున్నాం. ఈ సినిమా ఆపడానికి వెనుక ఏ వ్యూహాలు ఉన్నాయో తెలియదు. శపథం పార్ట్2 జనవరిలో రిలీజ్ అవుతుంది అని తెలిపారు ఆర్జీవీ. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రమే కాదూ.. ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే లేదన్నారు ఆర్జీవీ.
VYOOHAM pre release event is tmrw the 23rd at 5 pm in Vijaywada at Indira Gandhi muncipal stadium My heartfelt invitation to sri @ncbn , @naralokesh and @PawanKalyan to grace the occasion 🙏🙏🙏 pic.twitter.com/jabNUkU4HE
— Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023
ఆర్జీవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం చిత్రం ప్రి_రిలీజ్ ఫంక్షన్ శనివారం విజయవాడ లో జరగనుంది.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షణకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం కు వస్తున్నారు.. అనంతరం మీడియా తో…
— Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.