మూగబోయిన మరో గాన గంధర్వుడు.. శోక సంద్రంలో అభిమానులు

|

Jul 26, 2023 | 11:58 AM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ సింగర్‌ సురీందర్‌ షిండా (64) బుధవారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఆనారోగ్యంతో జులై 11న లూధియానాలోని డీమెస్‌సీ ఆసుపత్రిలో చేరారు. అక్కడే గత రెండు వారాలుగా..

మూగబోయిన మరో గాన గంధర్వుడు.. శోక సంద్రంలో అభిమానులు
Singer Surinder Shinda
Follow us on

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ సింగర్‌ సురీందర్‌ షిండా (64) బుధవారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఆనారోగ్యంతో జులై 11న లూధియానాలోని డీమెస్‌సీ ఆసుపత్రిలో చేరారు. అక్కడే గత రెండు వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన ఆ రోజు కన్నుమూశారు. షిండా మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

షిండా మృతిపట్ల నివాళులు అర్పిస్లూ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ట్వీట్‌ చేశారు. ‘గాయకుడు సురిందర్‌ షిండాజీ మరణ వార్త వినడం చాలా బాధాకరం. పంజాబ్‌లో అతని స్వరం మూగబోయింది. షిండాజీ భౌతికంగా లేకపోయినా ఆయన స్వరం పాటల రూపంలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. షిండాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానంటూ’ సీఎం భగవంత్‌ మాన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా లెజెండరీ సింగర్‌ అయిన సురిందర్‌ షిండా జానపద పురాణ గీతాలకు ప్రసిద్ధి. తన అద్భుతమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు. షిండా పాటలు పంజాబీ చిత్ర సీమలోనేకాకుండా యావత్‌ ప్రపంచం అంతటా మారుమ్రోగాయి. ముఖ్యంగా ‘జట్ జియోనా మోర్హ్,’ ‘పుట్ జట్టన్ దే,’ ‘ట్రక్ బిలియా,’ ‘బల్బిరో భాభి’, ‘కహెర్ సింగ్ డి మౌట్’.. వంటి పాటలు సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించాయి.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.