AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranya Rao Case: గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ రన్యా రావు భర్త బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసా? స్మగ్లింగ్‌లో అతని పాత్ర ఏంటి?

కన్నడ నటి రన్యా రావు రూ.12 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పోలీసులు ఆమె భర్త జితిన్ హుక్కేరి పాత్రను విచారిస్తున్నారు. జితిన్ ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్, బెంగళూరులో పలు ప్రాజెక్టులు చేపట్టారు. ఈ కేసులో ఆయన పాత్ర ఏమిటనేది దర్యాప్తులో తేలనుంది.

Ranya Rao Case: గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ రన్యా రావు భర్త బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసా? స్మగ్లింగ్‌లో అతని పాత్ర ఏంటి?
Jatin Hukkeri Ranya Rao 2
SN Pasha
|

Updated on: Mar 07, 2025 | 11:51 AM

Share

ఇటీవలె బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యా రావు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యా రావు అరెస్టు అయిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఆమె రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారంతో పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రస్తుతం కస్టడీలో ఉన్న నటి రన్యా రావు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆర్థిక నేరాల కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అయితే ఈ గోల్డ్‌ స్మగ్లింగ్‌తో ఆమె భర్త జితిన్‌ హుక్కేరికి ఏమైనా సంబంధం ఉందా అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆమె భర్త జితిన్‌ ఎవరు? ఆయన ఏం చేస్తుంటారు? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రన్యా రావును జితిన్‌ నాలుగు నెలల క్రితం తాజ్ వెస్ట్ ఎండ్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత వారు బెంగళూరులోని అప్‌స్కేల్ లావెల్లె రోడ్‌లోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటున్నారు. హుక్కేరి వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్ట్, బెంగళూరులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆయన లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ – ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నోవేషన్‌ స్పెషలైజేషన్‌తో ఉన్నత విద్యను అభ్యసించాడు. జతిన్ మొదట్లో బెంగళూరు రెస్టారెంట్ పరిశ్రమలో తన వినూత్న డిజైన్లతో తన మార్క్‌ను చూపించాడు. ఇండియాతో పాటు లండన్‌లోనూ పలు నిర్మాణాలకు డిజైన్లు ఇచ్చాడు.

జితిన్‌కు WDA & DECODE LLC, క్రాఫ్ట్ CoDe అనే కంపెనీలు ఉన్నాయి. హాస్పిటాలిటీ ఆర్కిటెక్చర్ అండ్‌ ప్లానింగ్‌లో జితిన్‌కు మంచి అనుభవం ఉంది. బెంగళూరులోని హ్యాంగోవర్ అనే కాక్‌టెయిల్ బార్ అండ్‌ డైనర్‌ను జితినే డిజైన్‌ చేశాడు. బెంగళూరులో అతని క్లయింట్ పోర్ట్‌ఫోలియోలో బెంగళూరు XOOX, బ్రూమిల్, ఆలివ్ బీచ్ వంటివి ఉన్నాయి. అలాగే ఢిల్లీ, ముంబైలలో కూడా ప్రాజెక్టులు చేపట్టాడు. ఉన్నత విద్యలు అభ్యసించి, వృతి పరంగా మంచి పొజిషన్‌లోనే ఉన్న జితిన్‌కు ఈ గోల్డ్‌ స్మగ్లింగ్‌తో లింక్‌ ఉందా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.