ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకుంటూ గతేడాది కత్రినా కైఫ్ (Katrina Kaif) – విక్కీ కౌశల్(Vicky Kaushal) , రాజ్‌కుమార్ రావ్- పత్రలేఖ, అంఖితా లోఖండే- విక్కీ పెళ్లిపీటలెక్కారు. తాజాగా నాగిన్ బ్యూటీ మౌనీరాయ్ కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. దీంతో బాలీవుడ్‌లో తదుపరి పెళ్లి చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అందాల తార అలియా భట్ (Aliabhatt) లదేనని చాలామంది అనుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ప్రేమపక్షుల వివాహంపై బాగా ప్రచారం సాగుతోంది. సమ్మర్‌లో మార్చిలేదా ఏప్రిల్‌లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ తరచూ వెకేషన్లకు వెళ్లే రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక క్షేత్రం రణతంబోర్‌లో వీరి పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయని కొందరు, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఒక్కటైన సిక్స్ సెన్సెస్ రిసార్ట్ ఫోర్ట్ బార్వారాలోనే రణ్‌బీర్- అలియాల పెళ్లి జరుగుతుందని మరికొందరు అనుకుంటున్నారు.
అయితే అలియా పెళ్లిపై వస్తోన్న వార్తలు, ప్రచారాన్ని ఆమె సన్నిహితులు ఖండిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ‘రణబీర్-ఆలియాల వివాహం గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు ఏప్రిల్‌లో ఏడడుగులు నడవునున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ప్రస్తుతం వారిద్దరు తమ సినిమా కెరీర్లపై పూర్తి దృష్టి సారించారు. అలియా ‘గంగుబాయి కతియా వాడీ’ ప్రమోషన్లలో ఉండగా.. రణ్‌బీర్ తన అప్‌కమింగ్ ప్రాజెక్టు షూటింగుల్లో బిజీగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చారు. దీంతో రణ్‌బీర్- అలియాల పెళ్లి రూమర్లకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది. కాగా అలియా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Also Read:Nellore District: వందలాది పావురాళ్లను ఎగరేసేందుకు రంగం సిద్ధం.. అంతలోనే ఆటకట్టు
Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే భవదీయుడు నుంచి అప్డేట్..
West Bengal Politics: సెంటర్ వర్సెస్ బెంగాల్ పోరులో మరో ఎపిసోడ్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు?