ప్రపంచ రికార్డ్‌ క్రియేట్ చేసిన ‘రామాయణ్’..!

| Edited By:

May 01, 2020 | 2:34 PM

దూరదర్శన్‌లో పునః ప్రసారమైన రామానంద్ సాగర్ రామాయణ్‌ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 16న ఈ షోను 7.7కోట్ల మంది వీక్షించారు.

ప్రపంచ రికార్డ్‌ క్రియేట్ చేసిన రామాయణ్..!
Follow us on

దూరదర్శన్‌లో పునః ప్రసారమైన రామానంద్ సాగర్ రామాయణ్‌ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 16న ఈ షోను 7.7కోట్ల మంది వీక్షించారు. ఈ విషయాన్ని డీడీ ఇండియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ ఏడాది మార్చి 28 నుంచి రామాయణ్‌ను డీడీలో పునః ప్రసారం చేయగా.. మరోసారి తన సత్తాను చాటింది ఈ సీరియల్.

కాగా వాల్మీకి రామాయణ, తులసీదాస్ రామచరిత్‌మానస్‌ల ఆధారంగా రామానంద్ సాగర్ 78 ఎపిసోడ్‌ల ‘రామాయణ్‌’ను తెరకెక్కించారు. 1987 జనవరి 25 ప్రసారమైన ఈ సీరియల్ 1988 జూలై 31వరకు కొనసాగింది. ఇక ఆ తరువాత ప్రతి ఆదివారం ఉదయం గం.9.30ని.లకు ఈ సీరియల్ ను టీవీల్లో ప్రదర్శించారు. 1987 నుంచి 88 వరకు ప్రపంచంలోనే ‘మోస్ట్ వాచ్‌డ్ సీరియల్’‌గా రామాయణ్‌ అప్పట్లోనే రికార్డ్‌ క్రియేట్ చేసింది. అంతేకాదు 2003వరకు ‘అత్యధిక మంది చూసిన పౌరాణిక సీరియల్’‌గా ‘రామాయణ్’‌కు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు ఉండేది. ఇక ఇప్పుడు లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ధారావాహికను మళ్లీ ప్రసారం చేయగా.. మరోసారి రికార్డులు క్రియేట్ చేయడం విశేషం.

Read This Story Also: షాకింగ్ న్యూస్‌.. ప్లాస్మా థెరపీ చేయించుకున్న మొదటి వ్యక్తి మృతి