PSPK 26 movie: రాసుకో సాంబ.. ఈ పాట మామూలుగా ట్రెండ్ అవ్వదు..!
PSPK 26 movie: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 26వ చిత్రం ‘లాయర్ సాయబ్’. హిందీలో భారీ విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుస హిట్లతో దూసుకుపోతోన్న ఈ […]
PSPK 26 movie: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 26వ చిత్రం ‘లాయర్ సాయబ్’. హిందీలో భారీ విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుస హిట్లతో దూసుకుపోతోన్న ఈ సంగీత తరంగం లాయర్ సాబ్ సినిమా ద్వారా మొదటిసారిగా పవన్‌కు సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడెప్పుడో మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ప్రారంభించిన ఈ సంగీత దర్శకుడు.. తాజాగా ఓ పాటను రికార్డు చేశారు. ఆ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న థమన్.. ‘‘పవన్ 26వ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఓ పాటను పాడారు. అది మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇందుకోసం మా హార్ట్ అండ్ సోల్ పెట్టాం’’ అని కామెంట్ పెట్టారు. ఇక దానికి ప్రముఖ పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి స్పందించారు. రాస్కో సాంబ ఈ పాట మామూలుగా ట్రెండ్ అవ్వదు అంటూ కామెంట్ పెట్టారు. మరి ఈ పాట ఎలా ఉండబోతోందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా థమన్, సిద్ శ్రీరామ్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన సామజవరగమన పాట ఇటీవల మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Raasko sambaaEe paataa మామూలుగా ట్రెండ్ అవదు … https://t.co/Q3lLpRDOxj
— RamajogaiahSastry (@ramjowrites) February 13, 2020