AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అ!’ సీక్వెల్.. నిర్మాత దొరకలేదు.. ఆయన్ను కలవలేదు..!

Awe Sequel: టాలీవుడ్‌లో వచ్చిన విభిన్న చిత్రాల్లో అ! కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మించారు. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీ శర్మ, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు లభించడంతో పాటు బెస్ట్‌ మేకప్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఇదిలా ఉంటే […]

'అ!' సీక్వెల్.. నిర్మాత దొరకలేదు.. ఆయన్ను కలవలేదు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 13, 2020 | 8:55 PM

Share

Awe Sequel: టాలీవుడ్‌లో వచ్చిన విభిన్న చిత్రాల్లో అ! కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మించారు. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీ శర్మ, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు లభించడంతో పాటు బెస్ట్‌ మేకప్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి సీక్వెల్ తీస్తానని ఎప్పుడో ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే ఇంతవరకు ఆ సీక్వెల్‌కు సంబంధించిన ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అ!2పై సోషల్ మీడియాలో స్పందించారు ప్రశాంత్ వర్మ.

‘‘అ!2 గురించి నన్ను అడుగుతున్న వారందరికీ చాలా థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్‌పై మీరు చూపుతున్న ఆసక్తిని ధన్యవాదాలు. అ!2 సంబంధించిన స్క్రిప్ట్ పని ఏడాది క్రితమే పూర్తి అయ్యింది. అ! కంటే ఇది ఇంకా క్రేజీగా ఉంటుంది. కానీ దీన్ని నేను సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోతున్నా. ఎందుకంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించే దర్శకుడు నాకు ఇంకా దొరకలేదు. నన్ను నమ్మండి. నేను చాలా అలిసిపోయా. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయినప్పుడే ప్రారంభమైనట్లు’’ అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇక దీనికి స్పందిస్తున్న నెటిజన్లు.. నానిని సంప్రదించలేదా..? అని కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో మరోసారి ఈ రూమర్లపై స్పష్టతను ఇచ్చారు ప్రశాంత్. ‘‘అ!2 కోసం నాని గారిని నేను సంప్రదించలేదు. వాల్ పోస్టర్ సినిమా ద్వారా ఆయన కొత్త టాలెంట్‌ను మాత్రమే పరిచయం చేస్తారు. ఇకపై అయినా ఇలాంటి రూమర్లు చెక్ పడుతుందని’’ భావిస్తున్నా అని ప్రశాంత్ కామెంట్ పెట్టారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు