The Warriorr Movie Review: డాక్టర్‌… పోలీస్‌ అయితే ది వారియర్‌!

| Edited By: Janardhan Veluru

Jul 14, 2022 | 2:47 PM

The Warriorr Movie Review: సత్యలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే తెల్లచొక్కా కాదు, ఖాకీ కరెక్టనుకుంటాడు సత్య. ఆ క్రమంలో ఏం జరిగింది? సత్యకు సాయం చేయాలనుకున్న డీన్‌ పరిస్థితి ఏంటి?

The Warriorr Movie Review: డాక్టర్‌... పోలీస్‌ అయితే ది వారియర్‌!
The Warriorr
Follow us on

The Warriorr Movie Review: హీరోలు కెరీర్లో కచ్చితంగా ఒక్కసారైనా చేయాలనుకునే కేరక్టర్‌ పోలీస్‌. రామ్‌ ఏరికోరి కావాలనుకుని పోలీస్‌ కేరక్టర్‌ని సెలక్ట్ చేసుకున్నారు. డాక్టర్‌ కమ్‌ పోలీస్‌గా రామ్‌ మెప్పించారా? లింగుస్వామి కైండ్‌ మాస్‌ మసాలా స్క్రీన్‌ మీద స్పైసీగా అనిపించిందా? చూసేద్దాం..

సినిమా: ది వారియర్‌

సంస్థ: శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్

ఇవి కూడా చదవండి

నటీనటులు: రామ్‌ పోతినేని, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, అక్షర గౌడ, నదియ, భారతిరాజా, చిరాగ్‌ జాని, రెడిన్‌ కింగ్‌స్లీ, బ్రహ్మాజీ, జయప్రకాష్‌, దివ్య శ్రీపాద, నాగ మహేష్‌, రామచంద్రన్‌దురైరాజ్‌, మాస్టర్‌ రాఘవన్‌ తదితరులు

రచన-దర్శకత్వం: ఎన్‌. లింగుస్వామి

మాటలు: సాయిమాధవ్‌బుర్రా

కెమెరా: సుజిత్‌ వాసుదేవ్‌

ఎడిటింగ్‌: నవీన్ నూలి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

విడుదల: 14 జులై,2022

సత్య (రామ్‌) డాక్టర్‌ కావాలన్నది అతని తండ్రి కల. అతన్ని పోలీస్‌గా చూడాలన్నది తల్లి కోరిక. తండ్రి మాట ప్రకారం డాక్టర్‌ చదువుకుంటాడు రామ్‌. తన తల్లితో కలిసి ఇంటర్న్‌షిప్‌ కోసం కర్నూలుకు వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ గురు(ఆది పినిశెట్టి) అని పేరు మోసిన రౌడీ ఉంటాడు. అతని అరాచకాలు మామూలుగా ఉండవు. తన పనులకు అడ్డు వచ్చిన వారిని చంపేసి, అదే రోజు మొక్క నాటుతుంటాడు. అతను నాటిన మొక్కలు వనమైపోతాయి. అంత దుష్ట చరిత్ర ఉంటుంది గురుకి. సత్యకి, గురుకి మధ్య ఓ విషయంలో ఇష్యూ అవుతుంది. కొండారెడ్డి బురుజు ముందు గొడవవుతుంది. సత్యలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే తెల్లచొక్కా కాదు, ఖాకీ కరెక్టనుకుంటాడు సత్య. ఆ క్రమంలో ఏం జరిగింది? సత్యకు సాయం చేయాలనుకున్న డీన్‌ పరిస్థితి ఏంటి? విజిల్‌ మహాలక్ష్మి (కృతి శెట్టి)కి ఎదురైన ఆపద ఏంటి? దాన్నుంచి బయటపడిందా? లేదా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

ఖాకీ చొక్కా రామ్‌కి సూటయింది. డాక్టర్‌గానూ క్లాస్‌గా కనిపించారు. రేడియో జాకీగా విజిల్‌ మహాలక్ష్మి రోల్‌లో కృతి బాగా చేశారు. కర్నూలులో హీరో, హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ బావుంది. స్పీడ్‌ బ్రేకర్స్ సీన్‌ కుర్రకారు చేత విజిల్స్ వేయిస్తుంది. విలన్‌ రోల్‌లో ఆది చక్కగా సరిపోయాడు.

The Warrior

ప్రాణాల విలువ కన్నతల్లికి, డాక్టర్‌కి తెలుస్తుంది అనే డైలాగ్‌, కొన్ని సార్లు మందు వేయకపోవడమే రోగానికి అసలైన మందు అనే డైలాగు బావున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలైట్‌. రామ్‌, కృతి వేసిన స్టెప్పులు కూడా ఆ బీట్‌కి మ్యాచ్‌ అయ్యాయి.

అప్పటిదాకా సాఫ్ట్ గా ఉన్న డాక్టర్‌ ఒక ఇన్సిడెంట్‌తో పోలీస్‌ కావడం, కర్నూలులో పోస్టింగ్‌ తీసుకోవడం అంతా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సెకండ్‌హాఫ్‌లో చాలా సన్నివేశాలు సూర్య యముడు సినిమాను గుర్తుచేస్తాయి.

అనూహ్యమైన మలుపులతో ఆకట్టుకునే కథ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్‌. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించగలుగుతుండటంతో ఎగ్జయిట్మెంట్‌ మిస్‌ అయింది. నదియా, ఆదిపినిశెట్టి వైఫ్‌ కేరక్టర్లు చెప్పే డైలాగులు చూస్తే, తమిళ డైలాగులకు తెలుగు డబ్బింగ్‌ చెప్పిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ది వారియర్‌.. పక్కా కమర్షియల్‌ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా వార్తలు చదవండి