Ram Gopal Varma: నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్స్‌..

ఏ విషయంలోనైనా భిన్నంగా ఆలోచిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. సందర్భమైనా వ్యంగంగా స్పందించడం వర్మ

Ram Gopal Varma: నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్స్‌..
Ram Gopal Varma

Updated on: Jan 14, 2022 | 5:19 PM

ఏ విషయంలోనైనా భిన్నంగా ఆలోచిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. సందర్భమైనా వ్యంగంగా స్పందించడం వర్మ స్టైల్‌. అదే ఆయనను వార్తల్లో నిలిచేలా చేస్తోంది. కాగా అందరిలా తనకు పండగలు, పర్వదినాలు సెలబ్రేట్‌ చేసుకోవడం ఇష్టముండదని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు. అదేవిధంగా పండగ శుభాకాంక్షలు, విషెస్ చెప్పడం కూడా నచ్చదని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్లే గతంలో ఏ పండగకు కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పిన దాఖాలాలు లేవు. అయితే తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు వర్మ.

ఈ సందర్భంగా వరుస ట్వీట్లు పెట్టిన ఆర్జీవీ.. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ముఖేశ్‌ అంబానీని మించిన ఇల్లు, డబ్బు, హోదా రావాలి. మీరు ఇప్పుడు, ఎప్పుడూ కూడా ఎలాంటి వైరస్‌లు బారిన పడకూడదు. అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు రావాలి. అదేవిధంగా అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి. చిన్న సినిమాలు నిర్మించే దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద విజయం సాధించాలి. ఇక నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి’ అంటూ తనదైన శైలిలో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు.

Also Read:

Viral video: పిజ్జాపై మనసు పారేసుకున్న పిల్లి.. ప్రాధేయపడిన తీరు చూస్తే నవ్వాగదు..

Allu Arjun: సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరోగా..

Makar Sankranti 2022: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్‌.. చిన్న పిల్లాడిలా మారిపోయిన చిరంజీవి..