Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లు సాగిన చర్చలోకి లేటుగా అయినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. నిర్మాతకు, ప్రేక్షకులకు లేనిది ప్రభుత్వానికి ఏంటని, సినిమా టికెట్ ధరను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని తనదైన లాజిక్‌తో రంగంలోకి దిగారు ఆర్జీవీ. ఈ నేపథ్యంలోనే పలు వరుస ట్వీట్స్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఈ చర్చకు మరో కొత్త రూపాన్ని తీసుకొచ్చింది టీవీ9 బిగ్‌న్యూస్ బిగ్ డిబెట్ కార్యక్రమం.
ఏపీ సినిమా టికెట్ వ్యవహారంపై జరిగిన బిగ్ డిబెట్‌లో అటు వర్మతో పాటు మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మొదలైన చర్చ నేరుగా కలిసి మాట్లాడుకుందాం అనే వరకు చేరుకుంది. తనను ఎప్పుడైనా కలవొచ్చని నాని తెలపడంతో దానికి వర్మ కూడా ఒకే అన్నారు. దీంతో వీరిద్దరి చర్చకు కార్యరూపం దాల్చింది. ఈరోజు మధ్యాహ్నం (సోమవారం) ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ జరగనుంది. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని.. ఈనెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు ఆర్జీవీ ట్విట్ చేశారు.
ఇక ఈ భేటీలో ఏం తేలనుందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఈ భేటితో గతకొన్ని రోజులుగా జరుగుతోన్న చర్చకు ఫుల్‌స్టాప్ పడుతుందా.? వర్మ ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు.. దానికి నాని ఎలాంటి సమాధానాలు ఇస్తారో తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే.
Also Read:సురభి సోయగాలు ఫిదా కానీ కుర్రాడు కుర్రాడే కాదు..
RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్ వైట్ సినిమాకు ఎలా రీమిక్స్ చేశారో చూడండి..
Bangarraju Musical Night : బంగార్రాజు పాటల సందడి.. గ్రాండ్ గా మ్యూజికల్ నైట్..