Game Changer Teaser: గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. చరణ్ లుక్స్ వేరేలెవల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ అవైటెడ్ చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. ఈ సినిమాపై సినీ ప్రియులలో ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వినయ విధేయ రామ ప్రాజెక్ట్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న సినిమా ఇది.

Game Changer Teaser: గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. చరణ్ లుక్స్ వేరేలెవల్..
చరణ్‌, కియారా ఎంట్రీ ఇచ్చిన తీరు నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. చరణ్‌ మాట్లాడిన విధానానికి మురిసిపోతున్నారు అభిమానులు.
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2024 | 6:21 PM

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మొదటి సారి రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ సోలోగా నటిస్తోన్న ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్, లుక్స్ పై జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ శనివారం సాయంత్రం విడుదల చేసింది చిత్రయూనిట్. లక్నోలో ఈ టీజర్ ఈవెంట్ ‏గ్రాండ్ గా నిర్వహించింది మూవీ టీం. ఈ వేడుకలలో రామ్ చరణ్, కియారా అద్వానీ సందడి చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోయింది.

ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోయింది. బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకోకడు లేడు. కానీ వాడికి కోపం వస్తే వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు. అనే డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ యాక్షన్ సీన్స్, సినిమాలోని అన్ని రకాల సీన్స్ కట్స్ తో రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ బీజీఎమ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ మూవీలో చరణ్ లుక్స్ వేరేలెవల్. ఐయాం అన్ ప్రిడిక్టబుల్ అంటూ చరణ్ స్టైలీష్ గా చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలతోపాటు దేశవ్యాప్తంగా 11 చోట్ల ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.