మెగా స్టార్ చిరంజీవి కుటుంబంలోకి మరో అతిథి వస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోయే ఆనందంలో ఉంది. ఈ క్రమంలోనే తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. మొన్నటి మొన్న ఉపాసన సీమంతం వేడుకను దుబాయ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఉపాసన సోదరీమణులు అనుస్ఫాల, సింధూరి ఆమెకు సీమంతాన్ని నిర్వహించారు.
ఇక తాజాగా హైదరాబాద్‌లో ఉపాసనకు బేబీ షవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి నివాసంలో ఉపాసనకు బుధవారం బేబీ షవర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా వారసుడు లేదా వారసురాలు ఎప్పుడొస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఇంటికి బుల్లి అతిథి వచ్చేది ఎప్పుడో చెప్పేశారు ఉపాసన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. డాక్టర్లు తనకు జులై నెలలో డెలివరీ డేట్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమయంలో చరణ్ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. పుట్టిన బిడ్డను స్వయంగా చూసుకుంటనే తన కెరీర్‌పై దృష్టిసారిస్తానని ఉపాసన తెలిపారు. అటు వర్క్, ఇటు బిడ్డ పెంపకాన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..