గ్యాప్ తీసుకోవాలనుకుంటోన్న చెర్రీ..?

రామ్ చరణ్.. టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకుపోతున్న ఈ మెగాస్టార్ వారసుడు.. తండ్రి కోసం నిర్మాతగా అవతారమెత్తారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాన్ని స్థాపించి.. ఖైదీ నంబర్.150తో మెగాస్టార్‌కు గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడంతో పాటు.. భారీ వ్యయంతో చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌ సైరాను నిర్మించి, తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చారు. ఇక ఇప్పుడు చిరు- కొరటాల శివ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే వీటిలో ఖైదీ నంబర్.150కు మంచి లాభాలు వచ్చినప్పటికీ.. సైరా మాత్రం అనుకున్న మేర […]

గ్యాప్ తీసుకోవాలనుకుంటోన్న చెర్రీ..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 04, 2019 | 6:22 PM

రామ్ చరణ్.. టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకుపోతున్న ఈ మెగాస్టార్ వారసుడు.. తండ్రి కోసం నిర్మాతగా అవతారమెత్తారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాన్ని స్థాపించి.. ఖైదీ నంబర్.150తో మెగాస్టార్‌కు గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడంతో పాటు.. భారీ వ్యయంతో చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌ సైరాను నిర్మించి, తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చారు. ఇక ఇప్పుడు చిరు- కొరటాల శివ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే వీటిలో ఖైదీ నంబర్.150కు మంచి లాభాలు వచ్చినప్పటికీ.. సైరా మాత్రం అనుకున్న మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థను స్థాపించిన సమయంలో చెర్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన నిర్మాణ సంస్థలో సినిమాలను కొనసాగిస్తానని.. మిగిలిన హీరోలతో కూడా మూవీస్ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు నిర్మాణ రంగ పనులను చూసుకోవడం అతడికి కాస్త కష్టంగా మారిందట. ఇక నిర్మాణం విషయంలో చరణ్‌‌కు అంత అవగాహన లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందట(సైరా కలెక్షన్లు తక్కువ రావడానికి ఇద ఒక కారణమని విశ్లేషకుల అభిప్రాయం). ఈ నేపథ్యంలో కొద్ది రోజులు నిర్మాణానికి గ్యాప్ ఇవ్వాలని చెర్రీ అనుకుంటున్నాడట. పూర్తిగా ఇవ్వకపోయినప్పటికీ.. చిరు సినిమా తరువాత నిర్మాతగా కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఆ తరువాతే మిగిలిన హీరోలతో సినిమాలను నిర్మించాలని చెర్రీ అనుకుంటున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.