ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుత షెడ్యూల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కాగా ఈ చిత్రంలో చెర్రీ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిటీష్ ఆఫీసర్, మాస్ లీడర్, ఫ్రీడమ్ ఫైటర్‌గా చెర్రీ మూడు విభిన్న పాత్రలలో నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో రెండు పాజిటివ్ పాత్రలు, ఒకటి నెగిటివ్ పాత్ర అని కూడా టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మూడు పాత్రల్లో చెర్రీ కనిపించనున్న మొదటి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అవుతుంది.
మరోవైపు ఈ మూవీ మేకోవర్ కోసం దుబాయి వెళ్లాడు ఎన్టీఆర్. అతడు తిరిగివచ్చాక రాజమౌళి కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.