Ram Charan: అదరగొడుతోన్న రామ్‌ చరణ్‌ నయా లుక్‌.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న వీడియో..

Ram Charan: రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి...

Ram Charan: అదరగొడుతోన్న రామ్‌ చరణ్‌ నయా లుక్‌.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న వీడియో..
Narender Vaitla

|

Jul 02, 2022 | 7:46 PM

Ram Charan: రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కథకు సంబంధించి ఇప్పటి వరకు రకరకాల వార్తలు చక్కర్లు కొడుతోన్నా చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ వార్తలు వచ్చాయి. ఇక రామ్‌ చరణ్‌ పాత్రపై కూడా పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో చెర్రీ ఏకంగా ట్రిపుల్‌ రోల్‌లో నటించనున్నట్లు అప్పట్లో వార్తలు హల్చల్‌ చేశాయి. అయితే తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఈ వార్తకు బలం చేకూర్చింది. రామ్‌ చరణ్‌ కొత్త లుక్‌కు సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో రామ్‌ చరణ్‌ మేకప్‌ మ్యాన్‌ హెయిర్‌ స్టైల్‌ చేస్తునట్టు కనిపిస్తోంది. ఇక లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో ఉన్న ఉన్న చెర్రీ కొత్త లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన సమయంలో విడుదల చేసిన పోస్టర్‌లో రామ్‌ చరణ్‌ క్లాస్‌ లుక్‌లో కనిపించాడు. కానీ ప్రస్తుతం వైరల్‌ అవుతోన్న వీడియోలో కాస్త రగ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఒకటి కంటే ఎక్కువ పాత్రలో నటించనున్నాడని జరుగుతోన్న చర్చకు బలం చేకూర్చినట్లైంది. నెట్టింట వైరల్‌ అవుతోన్న చెర్రీ న్యూలుక్‌పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu