Ram Charan tweet : నా ఫేవరెట్ హీరో రవితేజ అదరగొట్టారు.. ‘క్రాక్’ సినిమా పై ప్రసంశలు కురిపించిన చరణ్

మాస్ మహారాజ రవితేజ చాలా రోజులతర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రాక్' సినిమా...

Ram Charan tweet : నా ఫేవరెట్ హీరో రవితేజ అదరగొట్టారు.. క్రాక్ సినిమా పై ప్రసంశలు కురిపించిన చరణ్

Updated on: Jan 13, 2021 | 7:02 PM

Ram Charan tweet : మాస్ మహారాజ రవితేజ చాలా రోజులతర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ మరోసారి ఇరగదీశారనే చెప్పాలి. జనవరి 9న విడుదలైన ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

చరణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘క్రాక్’ మూవీని చాలా ఎంజాయ్ చేశాను. నా ఫేవ‌రేట్ ర‌వితేజ గారు టాప్ ఫాంలో ఉన్నారు. శృతిహాస‌న్ అభూతమైన న‌ట‌న క‌న‌బ‌రిచింది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ వారి పాత్ర‌ల్లో సూపర్ గా నటించారు. థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ స్కోర్ చాలా బాగుంది. థ‌మ‌న్  బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చాలా బాగుంది. గోపీచంద్ మలినేని ర‌వితేజ‌ను టాప్ రేంజ్ లో చూపించారు. ఇత‌ర టీం స‌భ్యులు అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని చరణ్ ట్వీట్ చేశాడు.