AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnashtami : తమ్ముడు, చెల్లితో కలిసి క్లింకారా కృష్ణాష్టమి వేడుకలు.. ఎంత క్యూట్‏గా ఉన్నారో చూశారా..? ఫోటోస్ ఇదిగో..

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ లోకం ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఇంట్లోని బుజ్జి కృష్ణులను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీతోపాటు పలువురు సెలబ్రెటీస్, నటి రహస్య గోరఖ్ తన చిన్నారి కుమారుడి కృష్ణుడి గెటప్ ఫోటోలను షేర్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Krishnashtami : తమ్ముడు, చెల్లితో కలిసి క్లింకారా కృష్ణాష్టమి వేడుకలు.. ఎంత క్యూట్‏గా ఉన్నారో చూశారా..? ఫోటోస్ ఇదిగో..
Krishnashtami Celebretions
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2026 | 12:24 PM

Share

కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతిమణి ఉపాసన కొణిదెల తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన క్యూట్ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతీ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకునే చరణ్-ఉపాసన దంపతులు, ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమిని తమ పూజా మందిరంలో ఎంతో కంటికింపుగా జరుపుకున్నారు. ఉపాసన పంచుకున్న తొలి ఫోటోలో ఆమె తన ముద్దుల కుమార్తె క్లింకారాతోపాటు కొడుకు శివరామ్, చిన్న కూతురు అన్వీరాదేవితో కలిసి పూజా మందిరంలో కూర్చుని కనిపించారు. రంగురంగుల పూలతో అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహం ముందు ఉపాసన, తన ముగ్గురు పిల్లలు కలిసి ఒకే రంగు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఫోటోకు ‘కొణిదెల వారి ఇంట్లోకి చిన్ని కృష్ణుడు అడుగుపెట్టాడు’ అని ఉపాసన క్యాప్షన్ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు, సినీ ప్రముఖులు “చాలా క్యూట్ ఫ్యామిలీ” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ రకమైన క్యూట్ గ్లింప్సెస్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఒకవైపు గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబంతో కలిసి ఇలాంటి ఆధ్యాత్మిక పండుగలను జరుపుకోవడం చరణ్ దంపతుల ప్రత్యేకత అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

నటుడు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ దంపతులు తమ ముద్దుల కుమారుడికి చిన్ని కృష్ణుడి వేషధారణ వేసి మురిసిపోయారు. నెమలి పించం, చేతిలో పిల్లనగ్రోవి, బంగారు ఆభరణాలు ధరించిన ఆ చిన్నారి రూపం చూసి అభిమానులు, సినీ తారలు ఫిదా అవుతున్నారు. “మా ఇంట్లోని బుజ్జి గోపాలుడు” అంటూ రహస్య షేర్ చేసిన ఈ ఫోటోలు చూసిన వారంతా ఆ చిన్నారికి దిష్టి తీస్తూ, కామెంట్ల రూపంలో ఆశీస్సులు అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

ఉపాసన పోస్ట్…

రహస్య గోరఖ్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Follow Us