RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..

| Edited By: Anil kumar poka

Dec 27, 2021 | 7:02 PM

RRR Movie: ఇండియన్‌ బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోన్న ఆర్‌ఆర్ఆర్‌ సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపజయం ఎరగని డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తుండడం, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు..

RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..
Follow us on

RRR Movie: ఇండియన్‌ బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోన్న ఆర్‌ఆర్ఆర్‌ సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపజయం ఎరగని డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తుండడం, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు తొలిసారి కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ అంచనాలను అందుకోవడానికి రాజమౌళి అదే స్థాయిలో కష్టపడ్డారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌, రామ్‌చణ్‌, ఎన్టీఆర్‌ల లుక్‌లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి.

ఇక హీరో ఇంట్రడక్షన్‌ సన్నివేశాలకు రాజమౌళి పెట్టింది పేరు. ఇప్పటి వరకు దర్శకధీరుడి నుంచి వచ్చిన చిత్రాలే దీనికి నిదర్శనం. అలాంటిది ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తున్న ఆర్ఆర్‌ఆర్‌లో హీరోను పరిచయం చేసే సన్నివేశం ఏ రేంజ్‌లో ఉండాలి చెప్పండి. రాజమౌళి ఇందుకోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నారంటా. ఈ విషయాన్ని జక్కన్న ఇటీవల స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రాజమౌళి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో చెర్రీ ఇంట్రడక్షన్‌ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రామ్‌చరణ్‌ను పరిచయం చేసే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చెప్పిన జక్కన్న ఇందు కోసం ఏకంగా 2 వేల మంది జూనియరల్ ఆర్టిస్టులను ఉపయోగించుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ సన్నివేశం గురించి జక్కన్న మాట్లాడుతూ.. ‘ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు నేనే చాలా ఎగ్జైట్ అయ్యాను. థియేటర్‌లో ఈ సన్నివేశానికి వచ్చే స్పందన మాములుగా ఉండదు. సినిమాలో ఒక సన్నివేశాన్ని మించి మరొక సన్నివేశం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ సీన్‌కి వచ్చే అప్లాజ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంద’ని చెప్పుకొచ్చారు రాజమౌళి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు జక్కన్న. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి మరి.

Also Read: AFSPA in Nagaland: ఈశాన్యంలో చిచ్చు రేపుతున్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం.. దిద్దుబాటు చర్యల్లో కేంద్రం!

News Watch: కృష్ణ- గోదావరి, బోర్డుల తీరుపై కేంద్రం గుస్సా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Fruits: పండ్లు తినే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదమే..!