RRR Movie: యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఆర్.ఆర్.ఆర్ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. బాహుబలితో ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. రాజమౌళి కూడా ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను అత్యంత భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా, చిత్రీకరణ ఆలస్యం కావడం లాంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. చాలా రోజుల పాటు అప్‌డేట్‌లు లేక నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు జక్కన్న వరుస సర్‌ప్రైజ్‌లను అందిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్, చెర్రీల ఫస్ట్‌లుక్‌లతో మొదలైన ఈ సర్‌ప్రైజ్‌లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన నాటు నాటు, దోస్తీ పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మూడో పాటను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. నవంబర్ 26న ‘జనని’ అనే పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ విషయమై రాజమౌళి పోస్ట్ చేస్తూ.. ‘పెద్దన్న అద్భుతంగా కంపోజ్ చేసిన జనని పాట.. ఆర్‌ఆర్‌ఆర్ ఎమోషన్‌కు అద్దం పడుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ సోల్ ఆంథమ్ నవంబర్ 26న విడుదల కానుంది. ఎమోషనల్ అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ క్యాప్షన్ జోడించారు. మరి ఈ పాట ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: IBPS SO Recruitment 2021: నిరుద్యోగులకు గమనిక.. 1828 బ్యాంకు పోస్ట్‌లకు రేపే చివరితేదీ..
Maggi with Fanta: ఇదేమి వంటరా నాయనా.. ఫాంటా డ్రింక్ మిక్స్‌తో మ్యాగ్గీ డిష్.. వైరల్ వీడియో