నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలో నిలిచే వారిలో ముందు వరుసలో ఉంటారు హీరోయిన్ రాధిక ఆప్టే. వ్యక్తిగత జీవితానికి సంబంధించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్‌కే పూర్తిగా పరిమితమైన రాధిక.. తెలుగులో లెజెండ్, రక్త చరిత్ర వంటి చిత్రాలతో తెలుగు వారికి సైతం చేరువైంది. లయన్ చిత్రంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ల విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అంతా యంగ్ హీరోయిన్లనే తీసుకోవాలని భావిస్తున్నారన్న రాధికా.. ఈ కారణంగా తాను కొన్నిసార్లు ఆఫర్లు చేజార్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. హీరోయిన్లకు ఆఫర్లు రావడంలో వయసు కూడా ప్రభావాన్ని చూపిస్తోందన్న ఈ ముద్దుగుమ్మ.. కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్‌ని ఆఫర్లు రావడానికి ఇదే కారణమనని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలు లేవనే కామెంట్స్ ఇండస్ట్రీలో కామన్‌గా మారాయి అని రాధిక తెలిపింది.
ఈ విషయమై రాధిక ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమాల్లో ఆఫర్ల కోసం సర్జరీలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రతిభను కాకుండా ఫిజిక్‌ను బట్టి అవకాశాలివ్వడం ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఉంది. ఇప్పుడిప్పుడే దీనికి వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు’ అని చెప్పుకొచ్చింది. ఇక రాధిక కెరీర్ విషయానికొస్తే ఆమె ప్రస్తుతం ‘మౌనికా ఓ మై డార్లింగ్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..