కథ వినకుండా సంతకం పెట్టిన మొదటి సినిమా ఇదే.. కారణం పవన్ కల్యాణ్ అంటున్న స్టార్ హీరోయిన్
ప్రేక్షకులకే కాదు, నటీనటులకు కూడా అభిమాన నటులు ఉంటారు. వారిని కలవడం, మాట్లాడటం మాత్రమే కాదు, కుదరితే కెరీర్లో ఒక్కసారైనా వాళ్లతో కలిసి పనిచేస్తూ స్క్రీన్ షేర్చేసుకోవాలని కలలు కంటారు చాలామంది. అలాంటి కల తనకు కూడా ఉండేదని, ఆ కల నెరవేర్చుకునేందుకే ఆ ..

ప్రేక్షకులకే కాదు, నటీనటులకు కూడా అభిమాన నటులు ఉంటారు. వారిని కలవడం, మాట్లాడటం మాత్రమే కాదు, కుదరితే కెరీర్లో ఒక్కసారైనా వాళ్లతో కలిసి పనిచేస్తూ స్క్రీన్ షేర్చేసుకోవాలని కలలు కంటారు చాలామంది. అలాంటి కల తనకు కూడా ఉండేదని, ఆ కల నెరవేర్చుకునేందుకే ఆ హీరోతో సినిమా అనగానే కథ కూడా వినకుండానే సంతకం పెట్టానంటోంది ఓ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ఆ హీరోయిన్ ఈ సినిమా తన కెరీర్లోనే మైలురాయిగా నిలుస్తుందని ఆశపడుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నటిగా పేరొందిన రాశి ఖన్నా, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

Raashi Khanna
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక కావడం రాశి ఖన్నాకు కేవలం మరో ప్రాజెక్టు మాత్రమే కాదు, అది ఆమె చిరకాల కల అని తనే స్వయంగా చెప్పుకొచ్చింది. అంతేకాదు, స్క్రిప్ట్ చదవకుండానే రాశి ఈ సినిమాకి సంతకం పెట్టేసిందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
‘నా సినీ జీవితం ప్రారంభమైన నాటి నుంచి పవన్ కల్యాణ్ గారితో కలిసి పనిచేయాలనేది నాకు పెద్ద కల. ఆ కల నెరవేరుతుందని తెలిసిన నిమిషంలో స్క్రిప్ట్ కూడా చదవకుండా సంతకం చేశాను. ఇది నా కెరీర్‌లో కథ చదవకుండా ఒప్పుకున్న మొదటి సినిమా,’ అని రాశి ఖన్నా భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. ఈ సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2026 ఏప్రిల్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.




