Bangarraju: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు.. బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

|

Jan 18, 2022 | 9:33 PM

Bangarraju: నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లు హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రూ. 50 కోట్లను రాబ‌ట్టి రికార్డు క‌లెక్ష‌న్ల‌ దిశ‌గా దూసుకుపోతోందీ చిత్రం...

Bangarraju: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు.. బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..
Follow us on

Bangarraju: నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లు హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రూ. 50 కోట్లను రాబ‌ట్టి రికార్డు క‌లెక్ష‌న్ల‌ దిశ‌గా దూసుకుపోతోందీ చిత్రం. క‌రోనాను సైతం త‌ట్టుకొని ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. దీంతో సినిమా స‌క్సెస్‌ను చిత్ర యూనిట్ సెల‌బ్రేట్ చేసుకుంది. బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్ పేరుతో విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు.

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్ , నటుడు నారాయణమూర్తి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా న‌టుడు నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా నాగ్ మాట్లాడుతూ.. ఇటీవ‌ల జ‌గ‌న్‌తో స‌మావేశం గురించి చిరంజీవితో మాట్లాడాన‌ని చెప్పుకొచ్చారు. సినీ ప‌రిశ్ర‌మ‌పై సానుకూలంగా స్పందించిన జ‌గ‌న్‌కు నాగ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక‌పై సినీ ప‌రిశ్ర‌మ‌కు అన్నీ మంచి రోజులేన‌ని చెప్పుకొచ్చారు నాగార్జున‌. ఎన్టీఆర్ , ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారని చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వాళ్లిద్దరు జీవించే ఉంటారని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రపంచమంతా సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తెలుగువాళ్లు సినిమా చూస్తామనే నమ్మకాన్ని కలిగించారని, బంగార్రాజు విజయం నా నమ్మకం కాదు, తెలుగు ప్రేక్షకులపై ఉన్న నమ్మకమ‌ని నాగార్జున అన్నారు.

ఇక ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఆర్ నారాయ‌ణ మూర్తి మాట్లాడుతూ.. ‘సినిమాని కాపాడాలని సంక్రాంతి కి లాక్ డౌన్ కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షో లకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. సంక్రాంతి పండగంటే దేవుడి పండుగ, కోడి పందాల పండుగ, సినిమా పండగ. సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు. అన్ని షో లు బ్ర‌హ్మాండంగా ఆడించుకోండని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్ప‌డంతో బంగార్రాజు మంచి విజ‌యాన్ని అందుకుంది. హృదయ పూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నారాయ‌ణ మూర్తి చెప్పుకొచ్చారు.

Also Read: Punjagutta Steel Bridge: గురువారం నుంచి అందుబాటులోకి రానున్న పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి! ..చిత్రాలు

Jyotish Tips: జ్యోతిష్యం ప్రకారం చక్కెర ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా..?

Ayurvedic: ఒత్తిడి, ఆందోళన తగ్గించే ఆయుర్వేద మూలికలు.. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు..