- Telugu News Photo Gallery Political photos Hyderabad: punjagutta steel bridge inaugurate on january 20th
Punjagutta Steel Bridge: గురువారం నుంచి అందుబాటులోకి రానున్న పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి! ..చిత్రాలు
హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ కష్టాలు మెల్లమెల్లగా మెరుగుపడుతున్నాయి. సిగ్నల్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను శరవేగంగా నిర్మిస్తోంది తెలంగాణ సర్కార్/
Balaraju Goud | Edited By: Anil kumar poka
Updated on: Jan 18, 2022 | 10:37 PM

హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ కష్టాలు మెల్లమెల్లగా మెరుగుపడుతున్నాయి. సిగ్నల్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను శరవేగంగా నిర్మిస్తోంది తెలంగాణ సర్కార్ ఇందులో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో మరో స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది. నిర్మాణ పనులు పూర్తి కావడంతో జనవరి 20 గురువారం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది.

పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ పాత ముఖద్వారాన్ని తొలగించి నిర్మించిన కొత్త కేబుల్ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి పోతున్నాయి. నాగార్జున సర్కిల్ నుండి కె.బి.అర్ పార్క్ జంక్షన్ కు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలు కానుంది.

పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది తో పాటుగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవ్వడంతో జిహెచ్ఎంసి శాశ్వత పరిష్కారం చేయుటకు రూ. 17 కోట్ల వ్యయంతో స్టీల్ బ్రిడ్జి, పాత గేట్ నుండి హెచ్.టి లైన్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టింది జీహెచ్‌ఎంసీ.

హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా ప్రజల అవసరాలు తీరుతున్నాయి. మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లైఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు.

ఈ బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో మరో స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది.





























