- Telugu News Photo Gallery Political photos Telangana cabinet approves budget for new scheme to govt schools infrastructures cabinet
TS Education: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సర్కార్ బడిలో చదివితే ఫ్రీగా పుస్తకాలు, యూనిఫాం!
Telangana govt schools infrastructures: ప్రభుత్వ ఉచిత విద్యా బలోపేతానికి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Updated on: Jan 19, 2022 | 1:50 PM

ప్రభుత్వ ఉచిత విద్యా బలోపేతానికి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యకు మరింత ప్రాముఖ్యత ఇవ్వడంలో భాగంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడికి పథకం కింద పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7,289 కోట్లతో రూపొందిస్తున్న ప్రణాళిక కోసం తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.

మరోవైపు ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షురాలిగా.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ముఖ్యంగా రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టేందుకు ఈ కమిటి విధివిధానాలను రూపోందించనుంది. కాగా ఈ కమిటి నివేదికను రానున్న అసెంబ్లీ సమావేశాల్లోగా అందించాలని అసెంబ్లీ చర్చించి బిల్లును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రైవేటు విద్యా వ్యవస్థల ఫీజుల నియంత్రణ అంశం కూడా ఈ కమిటీ చర్చించి నివేదిక ఇవ్వనుంది.

తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేబినెట్

మరోవైపు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం రెండు జతల స్కూలు యూనిఫామ్స్‌తో పాటు, పుస్తకాలు , ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం తాజాగా వారికి బ్యాగ్‌లు , షూస్ కూడా ఇవ్వాలని బావిస్తోంది. రెండు జతల షూస్‌తో పాటు సాక్స్ కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల విద్యార్థుల కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే. దీనిపై కూడా త్వరలో మరోసారి చర్చించి ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.

ప్రైవేటు విద్యా వ్యవస్థల ఫీజుల నియంత్రణ అంశం కూడా కమిటీ చర్చించనుంది.
