Pushpa Movie: అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్సాఫీస్ ముందు పుష్ప భారీ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు దేశం మొత్తం ఉర్రూతలూగింది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ సంచలనం సృష్టించింది. విడుదలైన ఏడాది దగ్గరపడుతోన్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమా వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇటీవల ఈ చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన చిత్రాల కేటగిరిలో పుష్ప తెలుగు వర్షన్ సినిమాను ఇంగ్లిషు, రష్యన్ సబ్ టైటిల్స్‌తో ప్రదర్శించడం విశేషం. అంతేకాదండోయ్ త్వరలోనే పుష్ప చిత్రాన్ని రష్యన్ డబ్బింగ్ వర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే పుష్ప సీక్వెల్ ది రూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఫస్ట్ పార్ట్ ఊహించని విజయం అందుకోవడంతో సుకుమార్ సీక్వెల్‌పై దృష్టిసారించాడు. బడ్జెట్, క్యాస్టింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సీక్వెల్ చిత్రం మరెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..