Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గడిచిన శుక్రవారం బెంగళూరులో గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, ఇతర సినీ తారలు పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించారు. దేశ నలుమూలల్లో ఉన్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బెంగళూరు చేరుకున్నారు. ఆదివారం బెంగళూరులో పునీత్ అంత్యక్రియలు అశేష అభిమానుల కంటతడి సమక్షంలో జరిగింది. ఇదిలా ఉంటే బతికున్నన్ని రోజులు ఎంతో మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించిన పునీత్ మరణించిన తర్వాత ఇతరులకు ఉపయోగపడ్డాడు.
పునీత్ రాజ్‌కుమార్ నుంచి సేకరించిన నేత్రాలను నలగురికి అమర్చి చూపును ప్రసాదించారు. పునీత్ మరణించిన రోజే నారాయణ నేత్రాలయ వైద్యులు పునీత్ కళ్లను సేకరించారు. అనంతరం వాటిని నలుగురు యువతకు అమర్చినట్లు నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. ఈ విషయమై ఆయన వైద్య బృందంతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతారని మనందరికీ తెలిసిందే. అయితే అధునాతన సాంకేతికతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను రెండు భాగాలుగా విభజించి మొత్తం నలుగురుకి అందించారు.
నల్లగుడ్డులోని పైపొర, లోపలి పొరగా విభజించి వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వైద్యులు తెలిపారు. ఇక వాడకుండా మిగిలిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్‌లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్ల గుడ్డుకు గాయాలైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు.
Adipurush: శరవేగంగా ఆదిపురుష్ షూటింగ్ చేస్తున్న ప్రభాస్.. అందుకేనా..! వీడియో