లాక్‌డౌన్‌ వేళ.. రజనీ ఇంటి ముందు సడన్‌ ధర్నా.. షాకైన తలైవా ఫ్యామిలీ..!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశం మొత్తం ఇళ్లకే పరిమితమైంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ వేళ.. రజనీ ఇంటి ముందు సడన్‌ ధర్నా.. షాకైన తలైవా ఫ్యామిలీ..!

Edited By:

Updated on: Apr 13, 2020 | 5:35 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశం మొత్తం ఇళ్లకే పరిమితమైంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సడన్‌గా రజనీకాంత్ ఇంటి ముందు ట్రాన్స్‌జెండర్లు హల్‌చల్ చేశారు. ఎనిమిది మందితో ఓ గ్రూపుగా వచ్చిన ట్రాన్స్‌జెండర్లు పోయస్‌ గార్డెన్స్‌లోని తలైవా ఇంటి ముందు ధర్నా చేశారు.

కరోనా నేపథ్యంలో ఫెఫ్సీ వర్కర్లకు(FEFSI) రూ.50లక్షలను రజనీకాంత్ విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పులియన్‌తోప్‌ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్లు తమకు కూడా విరాళాలు ఇవ్వాలని రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. దీంతో తలైవా కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత రజనీ సతీమణి లతా రజనీకాంత్ వారికి రూ.5వేలు ఇవ్వగా.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వెల్లడించిన పోలీసులు రజనీ ఇంటి ముందు ధర్నా జరిగిందని.. కానీ ఎలాంటి కేసు నమోదు చేయలేదని అన్నారు.

Read This Story Also: మహేష్‌ ఖాతాలో మరో రికార్డు.. తొలి సినిమా సూపర్‌స్టార్‌దే..!