మహేష్‌ ఖాతాలో మరో రికార్డు.. తొలి సినిమా సూపర్‌స్టార్‌దే..!

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఖాతాలో మరో రికార్డు నమోదుకాబోతోంది. ఆయన నటించిన 'శ్రీమంతుడు' యూట్యూబ్‌లో దూసుకుపోతుండగా.. 100మిలియన్‌ వ్యూస్‌కు దగ్గర్లో ఉంది.

మహేష్‌ ఖాతాలో మరో రికార్డు.. తొలి సినిమా సూపర్‌స్టార్‌దే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2020 | 5:11 PM

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఖాతాలో మరో రికార్డు నమోదుకాబోతోంది. ఆయన నటించిన ‘శ్రీమంతుడు’ యూట్యూబ్‌లో దూసుకుపోతుండగా.. 100మిలియన్‌ వ్యూస్‌కు దగ్గర్లో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకు 99,311,775 వ్యూస్‌ వచ్చాయి. అతి త్వరలోనే ఈ మూవీకి 100 మిలియన్ వ్యూస్ రానున్నాయి. దీంతో టాలీవుడ్‌లోనే 100 మిలియన్లను సాధించిన మొదటి చిత్రంగా శ్రీమంతుడు నిలవనుంది.

తన తండ్రి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన యువకుడి కథ నేపథ్యంలో ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. ఆ యువకుడు తన తండ్రి సొంతూరి గురించి తెలుసుకోవడం., అక్కడకు వెళ్లడం.. గ్రామాన్ని దత్తత తీసుకోవడం,.. అక్కడి పరిస్థితులను మార్చేయడం కథాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. శ్రుతీ హాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, తులసి, సితార, సుకన్య, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2015లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ తరువాత నిజ జీవింతంలోనూ తన తండ్రి గ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేష్‌.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాదు ఈ మూవీ తరువాత పలువురు ప్రముఖులు కూడా గ్రామాలను దత్తత తీసుకున్నారు.

Read This Story Also: ఎన్టీఆర్, చెర్రీ కాంబోలో మరో మల్టీస్టారర్.. డైరక్టర్ ఎవరంటే..!