Samantha: అటు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్.. ఇక సమంత ఓకే చెప్పడమే తరువాయి.. సామ్ ఫ్యాన్స్ కోరుకుంటోంది కూడా అదే.
సమంత సక్సెస్‌కు, డెడికేషన్‌కు ఈ పేరు కేరాఫ్ అడ్రస్. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్నా, శరీరంలో రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతోన్నా ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుందీ బ్యూటీ. కెరీర్‌లో చిన్న గ్యాప్ ఇచ్చిన సామ్...
సమంత సక్సెస్‌కు, డెడికేషన్‌కు ఈ పేరు కేరాఫ్ అడ్రస్. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్నా, శరీరంలో రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతోన్నా ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుందీ బ్యూటీ. కెరీర్‌లో చిన్న గ్యాప్ ఇచ్చిన సామ్… పుష్పతో మళ్లీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇక తాజాగా యశోద చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మూడు రోజుల్లో రూ. 20 కోట్లకుపైగా రాబట్టి భారీ హిట్‌ను సాధించింది.
సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సమంత నట విశ్వరూపంతో మెప్పించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. యశోద పాత్రలో సమంత తప్ప మరెవవరూ సూట్ కారు అనేంతలా మెప్పించింది. ఇదిలా ఉంటే యశోద చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందా అంటే అవుననే సమాధానం ఇచ్చారు మేకర్స్. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ‘యశోద 2’ గురించి చాలా మంది అడుగుతున్నారన్నరని తెలిపిన ఆయన ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక దర్శకులు హరి, హరీష్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘యశోద 2’కు తమకు ఒక ఐడియా ఉందని, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉందని తెలిపారు. అయితే… అది సమంతపై ఆధారపడి ఉందని చెప్పుకొచ్చారు.
సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత.. యశోద సీక్వెల్ గురించి డిస్కస్ చేస్తామని.. సమంతగారు ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. సీక్వెల్ తెరకెక్కించేందుకు నిర్మాత కూడా రడీ ఉన్నారని చెప్పుకొచ్చారు. దీంతో యశోద 2 దాదాపు కాన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ సమంత సీక్వెల్‌కు ఓకే చెబుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే యశోద చిత్రంలో సామ్ నటనకు ఫిదా అయిన అభిమానులు సైతం సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అభిమానుల ఎదురు చూపులు ఫలిస్తాయో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..