పృథ్వీరాజ్‌కి కరోనా నెగిటివ్‌

మాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కరోనాను జయించారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌గా తేలింది.

  • Tv9 Telugu
  • Publish Date - 9:43 am, Wed, 28 October 20
పృథ్వీరాజ్‌కి కరోనా నెగిటివ్‌

Prithviraj Sukumaran News: మాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కరోనాను జయించారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. కానీ పూర్తిగా కోలుకునేందుకు మరో వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండబోతున్నా. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ చాలా థ్యాంక్స అని పృథ్వీ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్‌ను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో మళ్లీ పెరిగిన కేసులు)

కాగా ఇటీవల పృథ్వీరాజ్‌ జన గణ మన అనే షూటింగ్‌లో పాల్గొనగా.. అక్కడ ఆయనకు వైరస్‌ సోకింది. గత మంగళవారం జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. పృథ్వీతో పాటు జన గణ మన దర్శకుడు దిజో జోస్ యాంటోనీ, కొంతమంది మూవీ యూనిట్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో షూటింగ్‌ని ఆపేశారు. (వరంగల్‌ 9 హత్యల కేసులో నేడు తుది తీర్పు.. నిందితుడికి ఉరి శిక్ష..!)