Pranitha Subhash: ఆ సినిమా చూశాక నేను, నా భర్త ఏడుస్తూ బయటకు వచ్చేశాం.. బాపు బొమ్మ ప్రణీత భావోద్వేగం..

The Kashmir Files: ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశమవుతోన్న చిత్రం ది కశ్మీర్‌ ఫైల్స్‌ (The Kashmir Files). 1990 నాటి జమ్మూకశ్మీర్‌ పండిట్ల ఉచకోతలను నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihothri) ఈ సినిమాను తెరకెక్కించారు.

Pranitha Subhash: ఆ సినిమా చూశాక నేను, నా భర్త ఏడుస్తూ బయటకు వచ్చేశాం.. బాపు బొమ్మ ప్రణీత భావోద్వేగం..
Pranitha Subhash

Updated on: Mar 16, 2022 | 6:48 AM

The Kashmir Files: ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశమవుతోన్న చిత్రం ది కశ్మీర్‌ ఫైల్స్‌ (The Kashmir Files). 1990 నాటి జమ్మూకశ్మీర్‌ పండిట్ల ఉచకోతలను నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihothri) ఈ సినిమాను తెరకెక్కించారు. తక్కువ థియేటర్లలో విడుదలైన ఆ తర్వాత పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది ఈ చిత్రం. విడుదల సమయంలో అతి తక్కువ థియేటర్లలో స్క్రీనింగ్ జరుపుకున్నప్పటికీ ఆ తర్వాత పబ్లిక్ డిమాండ్ మేరకు అన్ని చోట్లా అదనపు షోలు ఏర్పాటుచేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ సినిమా హాట్‌ టాపిక్‌గా మారింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ సినిమాను చూడాలంటూ స్టేట్‌ మెంట్‌ ఇవ్వడం, హరియణా, మధ్య ప్రదేశ్, గుజరాత్‌, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ సినిమా ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. వాస్తవాలను వక్రీకరించి చూపించారని కశ్మీర్‌ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ది కశ్మీర్ ఫైల్స్‌ సినిమాను చూసింది. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంది.

‘మేం ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా వీక్షించాం. ఈ చిత్రం పూర్తయ్యేసరికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్‌ పండిట్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. వీలైతే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలి’ అని కోరింది ప్రణీత. కాగా ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైందీ అందాల తార. ఆ తర్వాత సిద్ధార్థ్‌ సరసన హీరోయిన్‌గా బావ మూవీలో నటించి మెప్పించింది. ఇక పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ సరసన అత్తారింటింకి దారేది లో నటించి మొదటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ గతేడాది నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ వివరాలను అందులో పంచుకుంటోంది. ఇందులో భాగంగానే ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమాను వీక్షించినట్లు చెప్పుకొచ్చింది.

Also Read:Tata Motors: టాటా మోటార్స్‌ కీలక నిర్ణయం.. 15వేల కోట్లతో కొత్త ఉత్పత్తుల అభివృద్ధి..!

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‏కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..

Health News: ఇప్పటి నుంచి చేతులతో ఆహారం తినండి.. చెప్పులు లేకుండా నడవండి.. ఎందుకంటే..?