ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌పై పూజా ఏమందంటే..!

కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించగా.. అత్యవసర సేవలు మినహా మిగిలిన మిగిలిన సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా బ్రేక్ పడింది.

ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌పై పూజా ఏమందంటే..!

Edited By:

Updated on: Mar 31, 2020 | 8:34 PM

కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించగా.. అత్యవసర సేవలు మినహా మిగిలిన మిగిలిన సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా బ్రేక్ పడింది. షూటింగ్‌లతో సహా విడుదల కావాల్సిన సినిమాలు కూడా ఆగిపోయాయి. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయడం కోసం హీరోలు, దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లు, మోషన్‌ పోస్టర్‌లు లాంటివి విడుదల చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నటిస్తోన్న 20వ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తానని ఆ మధ్య దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

డేట్‌ను ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ.. త్వరలో ప్రభాస్‌ 20 ఫస్ట్‌లుక్‌ వస్తుందంటూ ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ మూవీ ఫస్ట్‌లుక్‌పై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లుక్‌ గురించి అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తాను కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నానని ఆమె పేర్కొంది. ఈ మూవీలోని ప్రతి ఫ్రేమ్‌ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని ఆమె పేర్కొంది. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో తాను గిటార్‌ నేర్చుకుంటున్నానని పూజా తెలిపారు. కాగా ప్రభాస్‌ 20వ చిత్రంలో పూజా హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్‌, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.

Read This Story Also: ఎన్టీఆర్‌కు అతిలోక సుందరి తనయ ఓకే చెప్తుందా..!