AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pogaru Movie Trailer : ‘ట్రైలర్ లో కథ వెతక్కండి’.. ఆకట్టుకుంటున్న ‘పొగరు’ మూవీ ట్రైలర్

కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇటీవల తెలుగు లోకి కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి...

Pogaru Movie Trailer : 'ట్రైలర్ లో కథ వెతక్కండి'.. ఆకట్టుకుంటున్న 'పొగరు' మూవీ ట్రైలర్
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2021 | 5:50 PM

Share

pogaru movie trailer : కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇటీవల తెలుగు లోకి కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే..ఇదే క్రమంలో మరో సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధృవ్ సర్జా హీరో గా నటించిన పొగరు సినిమా త్వరలో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో భాగంగా గతంలో విడుదల చేసిన ‘కరాబు’ అనే సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

నందకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘అడ్రెస్ కనుకొన్ని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్ ని అనుకున్నార్రా.. ఫైటర్.. కొడితే ఎవడి అడ్రెస్ అయినా గల్లంతవ్వాల్సిందేరా..’ అంటూ హీరో పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో రష్మిక అమాయకపు యువతి పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో మరో ట్రైలర్ తో రాబోతున్నామని  ట్రైలర్ చివరిలో పేర్కొన్నారు.