భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశమంతా సంబరాలు జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు సామాన్యుల వరకు ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం 140 కోట్ల మంది కలల్ని, ఆశయాలను నిజం చేసిందని, ఇది తమకెంతో గర్వకారణమంటూ ఉప్పొంగిపోతున్నారు. ఈ గ’ఘన’ విజయాన్ని తరతరాలు గుర్తించుకుంటాయని, ఇందుకు కారణమైన ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా చంద్రయాన్ 3 విజయాన్ని పురస్కరించుకుని ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధిపతులు, అధ్యక్షులు భారత్‌కు, ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నారు. ఈక్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి సెహర్ షిన్వారీ కూడా చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా భారత్‌కు అభినందనలు తెలిపింది. ‘భారత్‌లో శత్రుత్వాన్ని పక్కన పెడితే ఇస్రోను అభినందించాల్సిందే. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా భారత్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఈ ఘనతను అందుకోవడానికి పాకిస్తాన్‌కు మరో 2,3 దశాబ్దాలు పడుతుంది. భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు ఈ రోజు మన దుస్థితికి మనం తప్ప మరెవరూ కాదు. అన్న విషయాన్ని పాకిస్తాన్ ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి’ అని పాక్ నటి సొంత దేశంపైనే సెటైర్లు వేసింది.
Apart from animosity with India, I would really congratulate ISRO for making history in the space research through Chandaryan3. The gap between Pakistan and India has widened to such a level in all aspects that now it will take two to three decades for Pakistan to reach there.…
ఇవి కూడా చదవండి— Sehar Shinwari (@SeharShinwari) August 23, 2023
కాగా సెహర్ షిన్వారీ నెటిజన్లకు బాగా పరిచయస్తురాలే. ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ అందాల తార గురించి తెలిసే ఉంటుంది. గతేడాది భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ షిన్వారీ చేసిన పోస్ట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే కనుక భారత జట్టును ఓడిస్తే..ఆ దేశ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింద. దీంతో కొన్నాళ్లు కనిపించకుండా పోయింది. ఇక ఆ మధ్యన పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయినప్పుడు ప్రధానమంత్రి మోడీని అరెస్ట్ చేయాంటూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌ను కోర వార్తల్లో నిలిచింది. ఇలా పలుసార్లు భారత్‌కు వ్యతిరేకంగా పోస్టులు చేసింది షెన్వారీ. అయితే చంద్రయాన్ 3 సక్సెస్ నేపథ్యంలో తొలిసారిగా భారత్‌కు అనుకూలంగా కామెంట్స్ చేసింది. అదే సమయంలో సొంత దేశంపై సెటైర్లు వేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..