OTT: పదకొండు వెబ్ సిరీస్‏లు ఒకే వేదికపై.. ప్రేక్షకులు చూస్తూ ఉండిపోయేలా సరికొత్త కంటెంట్..

|

Jun 16, 2022 | 10:20 AM

తెలుగు చిత్ర సీమకు సంబందించిన హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట్, నిహారిక మరియు సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్ వంటి తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో

OTT: పదకొండు వెబ్ సిరీస్‏లు ఒకే వేదికపై.. ప్రేక్షకులు చూస్తూ ఉండిపోయేలా సరికొత్త కంటెంట్..
Ott
Follow us on

ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాంపై ఓటీటీల హావా కొనసాగుతుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్తగా వినోదాన్ని అందించేందుకు పోటీపడుతున్నాయి.. సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లింగ్.. హర్రర్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి… ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా, జీ 5 వంటి ఓటీటీ సంస్థలు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ప్రకటించి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సైతం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్తగా ప్రకటన చేసింది.. తెలుగు వారి కోసం తెలుగు లో 11 ఒరిజినల్స్‌తో కూడిన పవర్-ప్యాక్డ్ కంటెంట్ ను తీసుకువస్తుంది. ఈ సందర్భంగా.. తెలుగు చిత్ర సీమకు సంబందించిన హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట్, నిహారిక మరియు సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్ వంటి తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో 11 ఒరిజినల్స్‌ సిరీస్ లను జీ5 గ్రాండ్ గా లాంచ్ చేసింది.

తెలుగు ప్రేక్షకుల కోసం 11 సిరీస్ లను ఒకే ప్లాట్‌ఫారమ్ మీదకు తీసుకువచ్చింది. ఎంతో క్యూరియాసిటీ గా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఈ ఒరిజినల్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు మరియు ఉత్తమమైన డబ్బింగ్ కంటెంట్‌ ఉన్న ZEE 5 అందరికి ఎంతో ఎంటర్ టైన్మెంట్ ను ఉత్సాహాన్ని ఇస్తుంది. అన్ని భాషలలో ప్రేక్షకుల కోసం వినోదాన్ని అందించిన జీ5 ఇప్పుడు.. 11 తెలుగు ఒరిజినల్‌ల కంటెంట్ ఆవిష్కరించడం ద్వారా దక్షిణాదిలోని వీక్షకులకు ZEE5 మరింత చేరువ అవుతుంది. ఈరోజు హైదరాబాద్‌లో తారల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో జీ5 మరింత మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దిల్ రాజు, హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, కోన వెంకట్, నిహారిక మరియు సుస్మిత కొణిదెల సమక్షంలో చాలా మంది వీక్షకులు ఎదురుచూస్తున్న ఈ కంటెంట్ స్లేట్ ఆవిష్కరించడం జరిగింది. రెక్కీ, అహా నా పెళ్లంట, ఏటీఎం, మా నీళ్ల ట్యాంక్, బహిష్కరణ, పరువు, ది బ్లాక్ కోట్, ప్రేమ విమానం, హంటింగ్ ఆఫ్ ది స్టార్స్, హలో వరల్డ్, మిషన్ తషాఫీ వంటి వెబ్ సిరీస్‏లో జీ5 స్ట్రీమింగ్ చేయబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.