Prema Vimanam: ఓటీటీలోకి రాబోతున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్.. ‘ప్రేమ విమానం’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

Apr 19, 2023 | 1:36 PM

తాజాగా మరో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న 'ప్రేమ విమానం' అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

Prema Vimanam: ఓటీటీలోకి రాబోతున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్.. ప్రేమ విమానం స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Prema Vimanam
Follow us on

ప్రస్తుతం థియేటర్లలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలు సక్సెస్ అందుకుంటున్నాయి. దసరా, ధమ్కీ, రావణాసుర చిత్రాలు హిట్స్ కాగా.. శాకుంతలం, మీటర్ పర్వాలేదనిపించాయి. ఓవైపు థియేటర్లలో సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నా.. అటు ఓటీటీలకు ఆదరణ తగ్గడం లేదు. సూపర్ హిట్ చిత్రాలతోపాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘ప్రేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఇద్దరు పిల్లలు (దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా), హీరో హీరోయిన్లు (సంగీత్ శోభన్, శాన్వీ మేఘన), వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇలా అందరూ కూడా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట ఇలా అందరినీ ఒకే చోటకు చేర్చుతుంది కథ. ఇక వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఉన్నతమైన ప్రొడక్షన్ విలువలతో తెరకెక్కిన ప్రేమ విమానం కచ్చితంగా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు. ఈ వెబ్ ఫిల్మ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్..తదితర విషయాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.