AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boomer Uncle OTT: ఓటీటీలో యోగిబాబు కామెడీ ఎంటర్ టైనర్.. తెలుగులో బూమర్ అంకుల్ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ మధ్యన హీరోగానూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అదరగొడుతోన్న ఆయన.. మరోవైపు సోలో హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అలా యోగిబాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'బూమర్ అంకుల్'. మార్చి 29న కోలీవుడ్ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అక్కడి జనాలను బాగానే ఆకట్టుకుంది.

Boomer Uncle OTT: ఓటీటీలో యోగిబాబు కామెడీ ఎంటర్ టైనర్.. తెలుగులో బూమర్ అంకుల్ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
Boomer Uncle Movie
Basha Shek
|

Updated on: Jul 17, 2024 | 9:15 AM

Share

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ మధ్యన హీరోగానూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అదరగొడుతోన్న ఆయన.. మరోవైపు సోలో హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అలా యోగిబాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూమర్ అంకుల్’. మార్చి 29న కోలీవుడ్ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అక్కడి జనాలను బాగానే ఆకట్టుకుంది. ఎప్పటిలాగే యోగిబాబు తన దైన కామెడీ స్టైల్ తో ఆడియెన్స్ ను మెప్పించారు. ఇప్పుడీ బూమర్ అంకుల్ మూవీ తెలుగులో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. జులై 20వ తేదీ నుంచి బూమర్ అంకుల్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఆహా. ఈ మేరకు బూమర్ అంకుల్ సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ‘ఫన్నీ బూమర్ అంకుల్’.. మిమ్మల్ని మరింత గట్టిగా నవ్విస్తాడు’ అని దీనికి క్యాప్షన్ జత చేసింది.

విడాకులు తీసుకున్న భర్తపై పగతో

కాగా బూమర్ అంకుల్ తమిళ్ వెర్షన్ ఇప్పటికే ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. స్వదేశ్ ఎంఎస్ తెరకెక్కించిన ఈ సినిమాలో యోగిబాబు, ఒలివా ప్రధాన పాత్రలు పోషించారు. రోబో శంకర్, సబా శేషు, తంగ దురై, బాలా, సతీశ్ మోహన్, ఎంఎస్ భాస్కర్, సోనా హైదర్ ఇతర పాత్రల్లో కనిపించారు. అంకా మీడియా పతాకంపై అన్బు, కార్తీక్ కే తలై నిర్మించిన ఈ సినిమాకు ధర్మ ప్రకాశ్, సంతన్ అనబజేగానే సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. బూమర్ అంకుల్ మూవీలో నేసమ్‌ (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులుగా కనిపిస్తారు. విదేశీ యువతి అమీతో నేసమ్‌కు పరిచయం ఏర్పడటం.. ఆపై పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే వారు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు..? అలాగే విడాకులు ఇవ్వాలనునే భర్తపై భార్య పగతీర్చుకోవాలని అనుకోవడం ఇలా కామెడీ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.

ఇవి కూడా చదవండి

ఆహా ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం