ఓటీటీలో సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్స్‌లో కొత్తకొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఆల్రెడీ థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీకి వారం రోజుల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో రొమాంటిక్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో పాటు సినిమాను బ్యాన్ చేయడంతో.. ఇప్పుడు ఆ సినిమాను ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు.
సెన్సార్ బోర్డు బ్యాన్ చేసే రేంజ్‌లో ఆ సినిమాలో ఏముంది.? ఏ ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు..? అసలు ఈ సినిమా ఏంటి.? తాజాగా ఓటీటీలోకి వచ్చిన సినిమా తెలుగు సినిమానే.. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ సినిమా పేరు ఎవోల్. రామ్ వెలగపూడి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.అలాగే ఈ సినిమాలో నటించినవారందరూ కొత్తవారే. అయితే ఈ సినిమాను ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
జులై నెలలో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఊహించాని విధంగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ‘ఎవోల్’ను సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. దాంతో చేసేడేమో లేక ఓటీటీలోకి ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. రెండు జంటల మధ్య జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఇప్పుడు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈమేరకు ఆహా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మరి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Telugu Film #Evol Streaming From 15th August On #AhaVideo.
Starring: #SuryaSrinivas, #JeniferEmmanuel, #DivyaSharma, #ShivakumarRamachandravarapu & More.
Written & Directed By #RamYogiVelagapudi.#EvolOnAha #EvolMovie #TeluguMovie #OTTUpdates #OTTFilms #FilmUpdates #PrimeVerse pic.twitter.com/rfRx7uZmIL— PrimeVerse (@primeverseyt) August 12, 2024