‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. యదార్థ సంఘటనల ఆధారంగా ఈమూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇదే మూవీ తరహాలో యదార్థ సంఘటన ఆధారంగా వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన సినిమా ది వ్యాక్సిన్ వార్. టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ సైంటిస్ట్ పాత్రలో నటించింది. ఆమెతో పాటు నానా పటేకర్, పల్లవి జోషి, రైమాసేన్, అనుపమ్ ఖేర్, నివేదిత భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైంది ది వ్యాక్సిన్ వార్. అయితే కశ్మీర్ ఫైల్స్ తరహాలో జనాలను ఆకట్టుకోలేకపోయింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజైనా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ది వ్యాక్సిన్ వార్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ది వ్యాక్సిన్ వార్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 24) నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ.
కాగా ప్రస్తుతానికి హిందీ భాషలోనే ది వ్యాక్సిన్ వార్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీ కథాంశంతో ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం తెరకెక్కింది. కరోనా టీకా తయారీలో భారతీయ శాస్త్రవేత్తల బృందం ఎలా కష్టపడింది? మహిళా శాస్త్రవేత్తలు ఎలాంటి పాత్ర పోషించారు? అనే అంశాలను ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు. మరి థియేటర్లలో ది వ్యాక్సిన్ వార్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Step into the world where courage confronts the crisis🫡
Watch The Vaccine War streaming from 24th of November only on @disneyplusHS
#TheVaccineWar@AnupamPKher @nanagpatekar @i_ambuddha pic.twitter.com/b5ZVPlkq94
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.