ఓటీటీలో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ సినిమా.. టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ మూవీ మిస్ అవ్వకండి
ఓటీటీలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతుంటే.. ఆ సినిమాలు కాస్తా నెలరోజులకు ఓటీటీలోకి వచ్చి మెప్పిస్తున్నాయి. తాజాగా ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఆ సినిమా ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.

ఓటీటీలో సినిమాలుజ్ దూసుకుపోతున్నాయి. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి.. వాటిలో కొన్ని సినిమాలు ఇప్పుడు దూసుకుపోతున్నాయి. టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా టాప్ లో కొనసాగుతుంది. ఈ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్‌గా రూ. 260కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే తెలుగు, తమిళ్ భాషలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు స్టార్ హీరో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరువు సినిమా తర్వాత సూర్య ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో సూర్య సరసన మలయాళం అందాల తార మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సూర్య, మమితా బైజు, రాధికల మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు ప్రేక్షకుల స్పందనను బట్టి తెలుస్తోంది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే పారిశ్రామికవేత్త, పిస్టల్ షూటర్ పాత్రలో కనిపించారు. కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాలు, హాస్యంతో కూడిన కథాంశంతో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తూ, సహజమైన హాస్యాన్ని జోడించడం సినిమాకు కలిసొచ్చిన అంశాలుగా నిలిచాయి. సూర్య తనదైన నటనతో ఆకట్టుకోగా, మమితా బైజు తన అల్లరి, సహజమైన అభినయంతో ప్రేక్షకులను అలరించింది. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ తమ అనుభవంతో పాత్రలకు మరింత బలం చేకూర్చారు. మరోవైపు వెంకీ అట్లూరి టేకింగ్, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కాగా ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ సినిమాను ఓటీటీలో ఆడియన్స్ తెగ ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
