కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రత్నం. పోలీస్, యాక్షన్, ఊరమాస్ సినిమాలు బాగా తెరకెక్కిస్తాడని పేరున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా కనిపించింది. ఏప్రిల్ 26న తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రత్నం థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లనే సాధించింది. విశాల్ గత సినిమాల్లాగే మొత్తం మూవీ అంతా యాక్షన్ సీన్లతో నింపేసినా ఊహకందని ట్విస్టులు ఆడియెన్స్ ను అలరించాయి. ఇక ఎప్పటి లాగే తన ఫైట్స్ తో ఫ్యాన్స్ ను మెప్పించాడు విశాల్. థియేటర్ల లో ఓ మోస్తరుగా ఆడిన రత్నం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంత చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. నిజానికి మే 24 నుంచి రత్నం సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఊహించినదాని కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. మే 23న తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రానుంది.
జీ స్టుడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం నిర్మించిన రత్నం సినిమాలో . సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ రత్నం సినిమాకు స్వరాలందించడం విశేషం. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, టీఎస్ జై ఎడిటర్ గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఎమ్మెల్యే పన్నీర్‌స్వామికి (సముద్రఖని) రత్నం (విశాల్ ) నమ్మిన బంటుగా ఉంటాడు. ఎమ్మెల్యే అండతో అవినీతి పరుల భరతం పడుతుంటాడు. అలాంటి రత్నం జీవితంలోకి అనుకోకుండా మల్లిక (ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి వస్తుంది. అదే సమయంలో మల్లికను చంపడానికి లింగం బ్రదర్స్ ప్రయత్నిస్తుంటారు. అసలు మల్లిక గతం ఏమిటి? శత్రువల బారి నుంచి మల్లికను ఎలా కాపాడాడు? తన విరోధులపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే రత్నం సినిమా. థియేటరల్లో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే యాక్షన్ సినిమాలు చూసే వారికి ఇది ఒక మంచి ఛాయిస్.
Dive into the heartwarming #AmmeKaadha full video song from #Rathnam, out now on @adityamusic.
Starring Puratchi Thalapathy @VishalKOfficial.
A film by #Hari.
A @ThisisDSP musical. @priya_Bshankar @stonebenchers @ZeeStudiosSouth @mynnasukumar… pic.twitter.com/LskMqjErGf— Aditya Music (@adityamusic) May 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.