
థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటుంటాయి. రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుంటాయి. ముఖ్యంగా క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా స్టోరీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఒక బిల్డింగ్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు సుశాంత్. ఒక రాత్రి బిల్డింగ్‌లో వింత శబ్దా లు వినిపిస్తాయి. అతన్ని ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది. దీంతో అతను సామ్ అనే ఒక డాక్టర్‌ను సంప్రదిస్తాడు. వీరిద్దరూ కలిసి ఈ రహస్యాలను తెలుసుకోవడానికి బిల్డింగ్‌లోకి వెళతారు. కానీ అక్కడ వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఒక దుష్ట శక్తి ఏకంగా సామ్‌ను ఆవహిస్తుంది. దీంతో సామ్‌ను రక్షించడానికి బిల్డింగ్ గతాన్ని, ఒక ప్రతీకార ఆత్మ సీక్రెట్ గురించి సుశాంత్ తెలుసుకుంటాడు. ఇక క్లైమాక్స్‌లో సుశాంత్ ఆత్మకు న్యాయం చేయడానికి ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు.
మరి ఆత్మ కోసం సుశాంత్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి ? సామ్‌ను వదిలి ఆ ఆత్మ వెళ్ళిపోతుందా ? అసలు ఈ ఆతమా గతం ఏమిటి ? బిల్డింగ్ లోని ఓ ల్యాబ్ లో కనిపించిన అమ్మాయిల అస్థిపంజరాలు ఎవరివి? ఇలా థ్రిల్లింగ్ ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది? మరి చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘గార్డ్: రివెంజ్ ఫర్ లవ్’. నిజామా బాద్ కు చెందిన విరాజ్ రెడ్డి ఇందులో హీరోగా నటించాడు. అలాగే మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. . ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 2 గంటల నిడివి కలిగి ఉన్న ఈ సినిమా, తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. IMDbలో 7.3/10 రేటింగ్ ను కూడా పొందింది. ఇప్పుడు మరో రెండు ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సస్పెన్స్, హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి గార్డ్ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి